హైదరాబాద్: మాస్క్ మళ్లీ తప్పదా, కోవిడ్ కాలం నాటి జ్ఞాపకాలు ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఎవరికి వాళ్లు కాళ్లు కట్టుకుని ఇంటికే పరిమితమయ్యారు. పక్కింటి వాళ్లు, ఎదురింటి వాళ్లతో ముచ్చట్లు పెట్టనిదే రోజు గడవని వాళ్లు మూతికి మాస్క్ పెట్టి ప్రహరీ గోడలు మీద నుంచి మనిషి చూడటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయులుగా మిగిలిపోయారు. రక్తసంబంధికులు చనిపోయినా అంతిమ చూపుకు నోచుకోని వారు ఎందరో…. మహారాజు గా పోవాల్సిన భౌతిక కాయం అనాధగా పోవటం కూడా కోవిడ్ రోజుల్లో మనం చేశాం. కానీ మనం ఆ భూతం నుంచి బయటపడ్డామా అంటే తడుముకోక తప్పదు. ఎందుకంటే వైరస్ వేరియంట్‌లు మారుతున్నాయి. రెండేళ్ల పాటు మనిషికి దూరం చేసిన మహమ్మారి ఇపుడు మరోసారి వణికిస్తోంది. గత 36 గంటల్లో ఇప్పటి వరకు భారతదేశం వ్యాప్తంగా 358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 300ల కేసులు కేరళలోనే నమోదు కావడం అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటి వరకు ఆరుగురు మృత్యు వాత పడినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం క్రిస్మస్ సమయం కావటంతో కేరళలో పాటు దేశ వ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ కేసులు 2,669 ఉన్నాయని చెబుతున్నారు. నిన్న బుధవారం ఒక్కరోజే 614కేసులు రిపోర్ట్ కావటం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ జె.యన్ 1 వేరియంట్ ను ఆసక్తికర వైవిధ్యంగా భావిస్తుంది. దీనివల్ల పెద్దగా ముంచుకు వచ్చే ప్రమాదం లేదని ఇప్పటికిప్పుడు భావించే పరిస్థితి కూడా లేదని అభిప్రాయపడుతోంది. సోషల్ మీడియా సంస్థ *x*లో డబ్ల్యూ.హెచ్.వో సంస్ధ ఉత్తరార్ధ గోళం లోని పలు దేశాల్లో శ్వాస కోశ సంబంధిత సమస్యల భారాన్ని పెంచుతుందని అభిప్రాయపడింది. కేంద్ర ఆరోగ్య శాఖ కేసులు సంఖ్య పెరుగుదలను గుర్తించిన మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు కూడా అలెర్ట్ అవుతున్నాయి.