- జై కెసిఆర్…జై జై బి ఆర్ యస్ అన్న కవిత కల్వకుంట్ల
- కాంగ్రెస్ కు శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్
- ప్రజాస్వామ్య విలువలు వికసిస్తాయంటున్న రేవంత్
హైదరాబాద్: ఓటమి విజయానికి నాంది అని వ్యక్తిత్వవికాస నిపుణులు చెబుతుంటారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసినపార్టీలు , అభ్యర్ధులు గెలుపు ఓటములు సహజమే. విజయం సాధించిన వ్యక్తులు ఆ పార్టీ తమ సంతోషాన్ని ఎలా చాటుకుంటాయి. ఓటమి పాలైన తరువాత ఆ నేతలు ఎలా స్పందించారనే విషయాన్ని సైతం పబ్లిక్ ముఖ్యంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు అధికార బి.ఆర్.యస్ పార్టీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. కేడర్ ను సమాయత్త పరిచేందుకు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు బి.ఆర్.యస్ పార్టీ నేత కెటిఆర్ ట్విట్టర్వేదికగా కౌంటింగ్ కు ముందే పోస్ట్ పెట్టారు. ఇందులో “Hattrick Loading 3.0 �� Get ready to celebrate guys ��” అంటూ ఒక సంక్షిప్త సందేశాన్ని ఆయన పార్టీ శ్రేణులకు పంపారు. అయితే ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ఫోటో ఇపుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. ఆయన తుపాకి గురిచూస్తున్న ఫోటోను పోస్ట్ చేయటంతో దానిపై రివర్స్ కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి. కారు నాలుగు టైర్లు పంక్చర్అయ్యాయంటూ పలువురు కామెంట్స్ చేయటం చర్చనీయాంశంగా మారింది. అయితే విజయంలో ఉన్న వ్యక్తులు ఆ కిక్‌లో ప్రత్యర్ధులను విమర్శిస్తుంటారు. ఇలాంటి కామెంట్స్ ను పెద్ధగా పట్టించుకోవాల్సిన అవసరం రాజకీయ నేతలకు అసలు ఉండకూడదు. ఇక తాజాగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో మరో ట్వీట్ ను బి.ఆర్.యస్ మాజీ మంత్రి కె.టి.ఆర్ విడుదల చేశారు. ఇందులో
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government ��
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But
we will take this in our stride as a learning and will bounce back
Congratulations to Congress party on winning the mandate. Wishing you Good Luck
అని ఉంది. రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రం లో గెలిచి అధికారంలోకి వచ్చిన తదుపరి మూడోసారి
గెలుస్తామనుకున్నప్పటికి ఆశించిన ఫలితం రాలేదని ఆయన భావించారు. అదే సందర్భంలో బంతిలా తిరిగి బౌన్స్అవుతామంటూనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ కి ఆయన అభినందనలు తెలిపారు. ఇక దీనిపై గాంధీ భవన్ వేదికగా తెలంగాణ పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కె.టి.ఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఆయన చెప్పటంతో పాటు ఇప్పటి వరకు ప్రగతి భవన్ గా ఉన్న ప్రాంగణాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఇక తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు వికసిస్తాయని సచివాలయం సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుందంటూ ఆయన కాంగ్రెస్ గెలుపు తరువాత హాజరైన తొలి మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ ఆసక్తి కరంగా మారాయి. ఇదిలా ఉంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత మరో ట్వీట్ చేశారు. ఇందులో జై కెసిఆర్ జై బి.ఆర్.యస్ అన్న ఆమె పార్టీ సోషల్ మీడియా విభాగంతో పాటు పార్టీ కోసం పని చేసిన వారిని అభినందించారు. అధికారంలో లేక పోయినా బి.ఆర్.యస్ తెలంగాణకు సేవ చేస్తుందంటూ గెలిచిన శాసన సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కి అభినందనలు తెలిపారు.
ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తరువాత విడుదలవుతున్న ట్వీట్లు, నేతల కామెంట్స్ తీవ్రంగా వైరల్అవుతుండటంతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపుతున్నాయి.